కాకినాడ సిటీ: కాకినాడ మున్సిపల్ ఎన్నికలు: నామినేషన్ కేంద్రాల వద్ద కఠిన నిఘా, డ్రోన్లతో పర్యవేక్షణ
కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. 66 డివిజన్లకు 17 మంది ఆర్వోల నియామకం, 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు, డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేసినట్లు కమిషనర్, అదనపు ఎస్పీ వెల్లడించారు.