మహబూబాబాద్: మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత: ముట్టడికి యత్నించిన పాలిటెక్నిక్ విద్యార్థులు
మహబూబాబాద్‌లో జీఓ నంబర్ 97 రద్దు కోరుతూ పాలిటెక్నిక్ విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగి కలెక్టరేట్ ప్రాంగణం రణరంగంగా మారింది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.