వనపర్తి: చిన్నారులు, గర్భిణుల ఆరోగ్యంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి: పోషణ మాసంపై కీలక ఆదేశాలు
9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులకు కీలక సూచనలు చేశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడాలని, పోషకాహార లోపంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.