ఒంగోలు అర్బన్: జిల్లావ్యాప్తంగా చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు, నిరంతరం నిఘా ఉంటుందని వెల్లడి
Ongole Urban, Prakasam | Aug 22, 2026
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులకు శనివారం పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రజల పట్ల స్నేహభావంగా మెలుగుతూ పద్ధతి మార్చుకోవాలని పోలీసులు వారికి వెల్లడించారు. చెడు ప్రవర్తన కలిగి ఉన్న వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంటుందని చెడు పనులు చేసిన ప్రజలకు ఇబ్బందులు కలిగించిన కఠిన చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలతో గతంలో రౌడీషీట్ ఉన్న వారిపై ఆ పేరుతో పిలవకుండా వారిని చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా పిలవడం జరుగుతుందని పోలీసులు అన్నారు.