పుంగనూరు: పెద్దరికుంట వద్ద రెండు బైకులు ఢీ: ముగ్గురికి గాయాలు
చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం పెద్దరికుంట వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బాలాజీ, కిషోర్ మరియు సాలమ్మ అనే ముగ్గురికి గాయాలయ్యాయి. హైవే అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.