వికారాబాద్: తుమ్మలపల్లిలో కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు.. భారీగా చేరికలు
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తుమ్మలపల్లిలో 200 మంది బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. గ్రామ సర్పంచ్ కర్నే రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేష్ పాల్గొన్నారు. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు వెల్లడించారు.