సిద్దిపేట అర్బన్: సిద్దిపేట జిల్లా: హాస్టల్లో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
సిద్దిపేట జిల్లా వర్గల్‌లోని బీసీ హాస్టల్లో పదో తరగతి విద్యార్థి రాంచరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపాధ్యాయుడు మందలించడంతో విద్యార్థి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. గజ్వేల్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.