నందికోట్కూరు: గ్రామపంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతలకు ప్రజలు సహకరించాలి బ్రాహ్మణ కొట్కూరు ఎస్సై మణికంఠ
రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలు శాంతి భద్రతలకు సహకరించాలని బ్రాహ్మణకొట్కూరు ఎస్సై మణికంఠ కోరారు ఎన్నికలు పూర్తి అయ్యేవరకు గ్రామాల్లో ఎలాంటి ఘర్షణలు గొడవలకు తావివ్వకుండా అందరూ సమన్వయం పాటించాలని సూచించారు ఎన్నికల సమయంలో వ్యక్తిగత విభేదాలకు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరు తమ ఓటును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవాలని ఎస్ఐ మణికంఠ పిలుపునిచ్చారు