ముమ్మిడివరం: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను కలిసిన ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్మన్
ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్మన్ గుబ్బల గంగారత్న భవాని, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ తో పాటు విజేతగా నిలిచిన ఎంపీటీసీ సభ్యురాలు గిడ్డి రత్నశ్రీని ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు.