కొండపి: కొండపి, సింగరాయకొండ పరిసర ప్రాంతాలలో ఈదురు గాలులతో కూడిన వర్షం, ముందస్తుగా విద్యుత్ సరఫరాను నిలిపివేసిన అధికారులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ, కొండపి పరిసర ప్రాంతాలలో శుక్రవారం ఉదయం మోస్తారు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మబ్బులు పట్టి ఉండగా 9 గంటల సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. విద్యుత్ శాఖ అధికారులు ముందస్తుగా అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. కొద్దిగా రోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడ్డ ప్రజలు మోస్తారు వర్షంతో ఉపశమనం పొందారు. వర్షపాతం వివరాలు వాతావరణ శాఖ ఇంకా వెల్లడించవలసి ఉంది.