కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో 1146 పొగాకు బేళ్లు కొనుగోలు: వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్
కొండపి స్థానిక పొగాకు వేలం కేంద్రంలో గురువారం నిర్వహించిన వేలంలో 1146 బేళ్లు కొనుగోలయినట్లు వేలం నిర్వహణ అధికారి జి. సునీల్ కుమార్ తెలిపారు. కస్టర్ పరిధిలోని నేతివారి పాలెం,రామచంద్రపురం గ్రామాలకు చెందిన రైతులు 1282 బేళ్లను వేలానికి తీసుకొని వచ్చారు.అందులో 1146 బేళ్లు కొనుగోల అయ్యాయి.వ్యాపారులు వివిధ కారణాలతో 136 బేళ్లను తిరస్కరించారు పొగాకు గరిష్ట ధర కేజీ రూ 280,కనిష్ట ధర కేజీ రూ 210, సరాసరి ధర కేజీ రూ 255.60 గా నమోదయింది. వేలంలో 18 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. వేలాన్ని బోర్డు వైస్ చైర్మన్ బొడ్డపాటి బ్రహ్మయ్య సందర్శించారు.