కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో పొగాకుకు మద్దతు ధరలు లేవంటూ రైతులు నిరసన
కొండపి పొగాకు వేలం కేంద్రంలో మద్దతు ధరలు లేవంటూ గురువారం రైతులు నిరసన వ్యక్తం చేశారు. నాణ్యమైన పొగాకుకు తగిన ధర రావడం లేదని వేలంను గంటపాటు నిలిపివేశారు. అనంతరం కొండేపి పొగాకు బోర్డు అధికారులు జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇవ్వడంతో వేలం తిరిగి ప్రారంభమైంది.