కొండపి: పాలేటిపాడులో సాగు చేస్తున్న పంటల విస్తీర్ణంపై కేంద్ర గణంకాల అధికారుల బృందం తనిఖీలు నిర్వహణ
జరుగుమల్లి మండలం పాలేటిపాడులో సాగు చేస్తున్న పంటల విస్తీర్ణంపై కేంద్ర గణంకాల అధికారుల బృందం గురువారం తనిఖీలు నిర్వహించింది. సాగు చేసిన పంటల వివరాలు, ఈ-క్రాప్లో నమోదైన వివరాలు సరిపోల్చామని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తెలిపారు. మండల వ్యవసాయాధికారి యుగంధర్ రెడ్డి, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.