కొండపి: పాత సింగరాయకొండలో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం
సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో శుక్రవారం ఉదయం భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు వీయడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గురువారం వరకు 35 డిగ్రీల ఎండతో అల్లాడిన ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి భారీ వర్షం పడటంతో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందారు. గాలులులకు అక్కడక్కడా చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.