గంగాధర నెల్లూరు: కార్వేటినగరం వద్ద బోల్తా పడిన ఇసుక టిప్పర్: ఇద్దరికి తీవ్ర గాయాలు
చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలోని కనుమ వద్ద ఇసుక టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలవ్వడంతో వారిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ స్తంభాలను ఢీకొట్టిన ఈ టిప్పర్ ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.