అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ మెగా ఇండస్ట్రియల్ పార్క్: భూమి కోల్పోయే రైతులకు కలెక్టర్ భరోసా
ఆదిలాబాద్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణపై కలెక్టర్ రాజర్షి షా రైతులతో సమావేశమయ్యారు. రైతులకు న్యాయమైన నష్టపరిహారం అందిస్తామని, పారదర్శకంగా ప్రక్రియను నిర్వహిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. గిమ్మ, గూడ, రాంపూర్, హాతిగాట్ గ్రామాల రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.