నందికోట్కూరు: తత్తూరు క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తత్తూరు క్రాస్ రోడ్డు వద్ద కారు ఆటోనుఢీ కొట్టింది, ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సామేలు అక్కడికక్కడే మృతి చెందాడు, మృతుడు పారుమంచాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు, మృతుడికి భార్య, కుమారుడు,ఇద్దరూ కూతుర్లు ఉన్నారు, జూపాడుబంగ్లా పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు