జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి - నిందితుడికి ఏడాది జైలు శిక్ష
జగిత్యాల జిల్లా మేడిపల్లిలో అజాగ్రత్తగా కారు నడిపి యువకుడి మృతికి కారణమైన వ్యక్తికి ఏడాది జైలు శిక్ష, 1,000 రూపాయల జరిమానా విధిస్తూ కోరుట్ల కోర్టు తీర్పునిచ్చింది. 2020లో జరిగిన ఈ ప్రమాద కేసులో సాక్ష్యాధారాల పరిశీలన తర్వాత న్యాయమూర్తి ఈ తీర్పు వెలువరించారు.