కొండపి: సింగరాయకొండ పాకాల సముద్ర తీరంలో జరిగే బీచ్ ఫెస్టివల్ ని విజయవంతం చేయాలన్న కలెక్టర్ రాజాబాబు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకాల బీచ్ లో ఈనెల 14, 15వ తేదీలలో జరిగే బీచ్ ఫెస్టివల్ ని విజయవంతం చేయాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీచ్ ఫెస్టివల్ లో సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజికల్ నైట్, హెలికాప్టర్ రైడ్, వాటర్ స్పోర్ట్స్, ఫుడ్ స్టాల్స్, కళా ప్రదర్శనలు, ఆటలు, పాటలు వంటి కార్యక్రమాలతో కార్యక్రమం చక్కగా జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రజలందరూ హాజరై విజయవంతం చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.