ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని నేతివారిపాలెం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న ఇద్దరినీ స్థానిక ఎస్సై ప్రేమ్ కుమార్ సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.1,750 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని అటువంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ ప్రేమ్ కుమార్ తీవ్రంగా హెచ్చరించారు.