ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం లోని పొన్నలూరు మండలంలో ఆదివారం స్కై ప్రాజెక్టును పోలీసులు అమలు చేశారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ డ్రోన్ ఎగరవేశారు. సెలవ రోజు కావడంతో నిర్మానుష్య ప్రదేశాలలో కోడిపందాలు పేకాట ఆడే అవకాశాలు అత్యధికంగా ఉండే నేపథ్యంలో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. అసాంఘిక కార్యకలాపాలు అడ్డుకట్ట వేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు పొన్నలూరు ఎస్సై వెల్లడించారు.