ఒంగోలు అర్బన్: జిల్లాలోని సముద్ర తీరాలను పరిశీలించి గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన అడిషనల్ ఎస్పి ఉగేంద్ర బాబు
Ongole Urban, Prakasam | Sep 13, 2026
ప్రకాశం జిల్లాలోని సముద్రతీరాలను ఆదివారం అడిషనల్ ఎస్పీ ఉగేంద్ర బాబు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. గణేష్ నిమజ్జన ఏర్పాట్లను సంబంధిత స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా గణేష్ నిమజ్జనాలు పూర్తయ్యలా చూడాలని సిబ్బందికి అడిషనల్ ఎస్పీ పలు సూచనలు సలహాలు ఇచ్చారు. నిమజ్జనానికి వస్తున్న వ్యక్తులు సముద్రం లోతుకు మరింత లోతుకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.