గిద్దలూరు: గిద్దలూరు ABM పాలెంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు, 15 ద్విచక్ర వాహనాలు 3 ఆటోలు స్వాధీనం
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఏబీఎం లో ఆదివారం అర్బన్ సీఐ సురేష్ ఎస్సైలు సిబ్బందితో కలిసి కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలు మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి అనుమానిత వ్యక్తులను ప్రశ్నించినట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో సెర్చ్ చేపట్టినట్లు తెలిపారు. అలానే ప్రజలకు రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు అరికట్టే అంశంలో అవగాహన కల్పించామని అన్నారు. అలానే అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.