గంగాధర నెల్లూరు: కార్వేటినగరం: చింతమండి క్రాస్ వద్ద బైక్ను ఢీకొట్టిన కారు, వ్యక్తికి తీవ్ర గాయాలు
కార్వేటినగరం మండలం చింతమండి క్రాస్ వద్ద మంగళవారం మధ్యాహ్నం కారు, బైక్ ఢీకొన్నాయి. ఈదువారిపల్లికి చెందిన మురుగయ్య బైక్పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను పళ్లిపట్టులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందింది.