రాప్తాడు: రాప్తాడు ఆత్మకూరు కనగానపల్లి చెన్నైకొత్తపల్లి రామగిరి మండల కేంద్రాల్లో టిడిపి 4వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు ఆత్మకూరు కనగానపల్లి చెన్నై కొత్తపల్లి అనంతపురం రూరల్ రామగిరి మండల కేంద్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో టిడిపి 44 ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా రాప్తాడులో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 1983లో నందమూరి తారకరామారావు టిడిపి పార్టీని ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల వారిని ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు అని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.