ఆత్మకూరు: ఆత్మకూరు హైవేపై సిమెంట్ ట్యాంకర్ బోల్తా, ఆ లారీని ఢీకొట్టిన మరో లారీ, భారీగా నిలిచిపోయిన లారీలు
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు హైవేలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి సమీపంలో తెల్లవారుజామున సిమెంట్ ట్యాంకర్ లారీ బోల్తా పడింది. బోల్తా కొట్టిన లారీని తప్పించబోయి మరో లారీ ప్రమాదానికి గురైంది. దీంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆత్మకూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. దీంతో వాహన రాకపోకలు స్తంభించిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.