విశాఖపట్నం: సింహాచలం క్షేత్రాన్ని సందర్శించిన సౌత్ కోస్ట్ రైల్వే ఉన్నతాధికారి శంషేర్ సింగ్ యాదవ్
సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దక్షిణ తట రైల్వే చీఫ్ మెటీరియల్స్ మేనేజర్ శంషేర్ సింగ్ యాదవ్ తన సతీమణితో కలిసి దర్శించుకున్నారు. వారికి ఆలయ పర్యవేక్షణ అధికారి కరోతి సూర్యనారాయణ సాదర స్వాగతం పలికారు.