పెద్దాపురం: సామర్లకోటలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం: తొలిరోజు 2 నామినేషన్లు
సామర్లకోట మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు వెంకటకృష్ణరాయపురం-2 మరియు పవర/పండ్రవాడ గ్రామాలకు సంబంధించి రెండు నామినేషన్లు అందినట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు నిబంధనల మేరకు నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు.