కుప్పం: రామకుప్పం మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్లు: 5 కేంద్రాల ఏర్పాటు
రామకుప్పం మండలంలో 22 గ్రామపంచాయతీల ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు 5 కేంద్రాలను ఎంపీడీఓ అశ్విని ఏర్పాటు చేశారు. రామకుప్పం, గౌరి విమాకులపల్లి, ముద్దనపల్లి, కంచనబల్ల, వీర్ణమలలోని స్వచ్ఛ గ్రామ భవనాల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. అభ్యర్థులు నిర్ణీత కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయాలి.