పర్వతగిరి: వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన ఇసుక ట్రాక్టర్, డ్రైవర్ పరిస్థితి విషమం
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం వద్ద ఇసుక ట్రాక్టర్ ఆటోను ఢీకొనడంతో డ్రైవర్ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడైన ట్రాక్టర్ డ్రైవర్ పరారీలో ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.