విశాఖపట్నం: పశుపక్ష్యాదుల కోసం నీరు, ఆహారం ఏర్పాటు చేయండి: గ్రీన్ క్లైమేట్ టీం పిలుపు
సూపర్ ఎల్ నినో ప్రభావంతో వన్యప్రాణులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఇంటి బయట మట్టి పాత్రలలో నీరు, చిరుధాన్యాలు ఉంచాలని గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జె.వి. రత్నం ప్రజలను కోరారు. జీవరాశిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన సూచించారు.