మేడ్చల్: బాచుపల్లి ఫ్లైఓవర్ పై ఘోర ప్రమాదం: విద్యార్థి మృతి
బాచుపల్లి ఫ్లైఓవర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్లారెడ్డి కాలేజీ విద్యార్థి అవునూరి సూర్య మృతి చెందాడు. మరో విద్యార్థిని గోదాసి వర్షకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాచుపల్లి సీఐ దాలి నాయుడు వివరాలు వెల్లడించారు. మృతుడు మంచిర్యాల జిల్లా మందమర్రి వాసిగా గుర్తించారు.