ఖాజీపేట: కాజీపేట-బల్లార్ష మధ్య నాలుగో రైల్వే లైన్: సర్వేకు ఏర్పాట్లు
కాజీపేట-బల్లార్ష మధ్య 203 కిమీ మేర 4వ రైల్వే లైన్ నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే సర్వే చేపట్టింది. సుమారు రూ.3,500 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం సెప్టెంబర్ 9, 10 తేదీల్లో సర్వే నిర్వహించనున్నారు. ఈ లైన్ అందుబాటులోకి వస్తే తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల మధ్య రవాణా వేగవంతం కానుంది.