ఉలవపాడు (M) పెద్దపట్టపుపాలెంలో 'రైతన్నా మీకోసం' కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను రైతుల ఇళ్లకు వెళ్లి ఆయన వివరించారు. రెండు విడతలుగా అన్నదాత సుఖీభవ నిధులు జమ చేశామని, రైతు రథం ద్వారా ట్రాక్టర్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. YCP ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టిందని విమర్శించారు. మత్స్యకార సేవ ద్వారా భృతి రెట్టింపు చేసి, 217 జీవోను రద్దు చేశామని MLA చెప్పారు.