ఒంగోలు పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు, రూ.30 వేలు నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు
Ongole Urban, Prakasam | Nov 5, 2025
ఒంగోలు పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో బుధవారం అలజడి నెలకొంది. ఏసీబీ అధికారుల దాడులతో అధికారులు ఉలిక్కిపడ్డారు. అధికారులు కార్యాలయంలోకి ప్రవేశించిన సమయంలో కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తి బయటకు కొంత నగదును విసిరి వేశాడు. ఇది గమనించిన అధికారులు వెంటనే ఆ డబ్బును స్వాధీనం చేసుకోవడంతో పాటు బాత్రూంలో దాచిపెట్టిన మరో రూ.10వేలు, మొత్తం రూ.30 వేలు నగదును అధికారులు స్వాధీనం చేసుకొని రికార్డులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని ఏసీబీ సీఐ తెలిపారు.