కురుపాం: పీఎం-జన్మన్ ఇళ్ల స్థల పట్టాల కోసం ఎమ్మెల్యేను కోరిన గిరిజనులు
పీఎం-జన్మన్ పథకం కింద మంజూరైన 12 ఇళ్ల నిర్మాణానికి స్థల పట్టాలు మంజూరు చేయాలని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి గారిని దురిబిలి గ్రామ గిరిజనులు కోరారు. సర్వే నంబర్ 21-2లో తమకు పట్టాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.