కురుపాం: మాజీ మంత్రి విజయరామరాజు గారికి ఘనంగా అంతిమ వీడ్కోలు
పార్వతీపురం మన్యం జిల్లాలో మాజీ మంత్రి విజయరామరాజు గారి అంతిమ యాత్ర ప్రభుత్వ లాంఛనాలతో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి ఆయనకు నివాళులు అర్పించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా మరియు మంత్రిగా సేవలందించిన విజయరామరాజు గారు మన ప్రాంతానికి ఎంతో సేవ చేశారు.