వికారాబాద్: కాంగ్రెస్ లోకి 200 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తుమ్మలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కు చెందిన 200 మంది నాయకులు, కార్యకర్తలు సర్పంచ్ కర్నే రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన, ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని వారు తెలిపారు.