గద్వాల్: ధరూర్ లో ఘనంగా చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి: నివాళులు అర్పించిన బిఆర్ఎస్ నాయకులు
గద్వాల జిల్లా ధరూర్ లో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలు జరిగాయి. బిఆర్ఎస్ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించి, ఆమె పోరాట పటిమను, త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.