వికారాబాద్: జిల్లా కేంద్రంలో ఇందిరానగర్ రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం భారీకేడ్లను ఏర్పాటు చేసిన సీఐ నాగరాజు
వికారాబాద్ జిల్లా కేంద్రంలో రామయ్యగూడ మార్గంలో ఇంద్రనగర్ రైల్వే గేట్ వద్ద ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే కోసం నూతనంగా వచ్చిన సీఐ నాగరాజు భారికేడ్లను వరుస క్రమంలో ఏర్పాటు చేయించారు. రైల్వే గేట్ పడ్డ అనంతరం వాహనదారులు ఇష్టం వచ్చినట్లు వెళుతున్న కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ఈ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని సీఐ భారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ కారణంగా ట్రాఫిక్ ఇబ్బంది జరగకుండా చర్యలు తీసుకున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.