కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీ విద్యార్థిని ఆత్మహత్య కేసు: నిందితుడు అరెస్టు
శాతవాహన యూనివర్సిటీ ఎల్ఎల్బీ విద్యార్థిని చంద్రకళ ఆత్మహత్య కేసులో నిందితుడు గజ్జల హరికృష్ణను కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి పేరుతో మోసం చేసి, వేధింపులకు గురిచేయడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ కోటేశ్వర్ తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు.