అనంతపురం అర్బన్: నగరంలోని ట్రాఫిక్ పోలీసులకు వేసవి సురక్షిత ఉపకరణలు అందజేసిన జిల్లా ఎస్పీ జగదీష్
Anantapur Urban, Anantapur | May 6, 2026
అనంతపురం నగరంలోని ట్రాఫిక్ పోలీసులకు వేసవి సురక్షిత ఉపకరణలు బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో జిల్లా ఎస్పీ జగదీష్ అందజేశారు.సుమారు 100 మంది సిబ్బందికి కూల్ కళ్లద్దాలు, లీటర్ వాటర్ బాటిల్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్, క్యాప్, తదితర ఉపకరణలు కల్గిన కిట్లను జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన ఛేంబర్లో పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్. మండుటెండలో ట్రాఫిక్ విధుల్లో ఉన్న సిబ్బంది సంక్షేమం కూడా ముఖ్యం... వేసవిలో వడదెబ్బకు గురికాకుండా, వేడి బారినకుండా ఈ సురక్షిత ఉపకరణలు దోహదం చేస్తాయని జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు.