మందమర్రి: మందమర్రిలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
మందమర్రిలోని కృష్ణ కాలనీ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. 108 సిబ్బంది సాయంతో క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.