నంద్యాల అర్బన్: నంద్యాలలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, జెండా ఆవిష్కరించిన మంత్రి ఫరూక్
Nandyal Urban, Nandyal | Aug 15, 2026
నంద్యాల బొమ్మలసత్రం డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఫరూఖ్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. మంత్రి ఫరూఖ్, జిల్లా కలెక్టర్ రాజకుమారి సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. దేశభక్తి నినాదాలు, జాతీయ గీతంతో కార్యక్రమ ప్రాంగణం మార్మోగింది. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాలు ఆకర్షించాయి