గన్నవరం: ఘంటసాల మండలంలో సాగునీటి కష్టాలు: వెయ్యి ఎకరాల్లో నాట్లు పడని వైనం
ఘంటసాల మండలంలోని చిలకలపూడి, వి.రుద్రవరం గ్రామాల్లో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నిమ్మగడ్డ లాకుల నుంచి నీరు విడుదల కాకపోవడంతో వెయ్యి ఎకరాల్లో నాట్లు పడలేదు. శివారు ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.