వనపర్తి: వనపర్తిలో ఘనంగా కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు
వనపర్తి ఐడీఓసీలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు జరిగాయి. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ, కాళోజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.