విశాఖపట్నం: ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్లకు కీలక సూచనలు చేసిన రీజినల్ మేనేజర్ బి. అప్పలనాయుడు
విశాఖపట్నం మద్దిలపాలెం డిపోలో ఆర్టీసీ డ్రైవర్లకు జరిగిన శిక్షణా తరగతుల్లో రీజినల్ మేనేజర్ బి. అప్పలనాయుడు పాల్గొన్నారు. ప్రయాణికుల భద్రత, వాహనాల నిర్వహణ, ట్రాఫిక్ నిబంధనల పాటింపుపై డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.