రాయపర్తి: వరంగల్ జిల్లాలో ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు: ఇద్దరికి తీవ్ర గాయాలు
వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.