కుప్పం: రామకుప్పంలో వరుస ద్విచక్ర వాహనాల చోరీలు.. ఆందోళనలో స్థానికులు
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో వరుస బైక్ చోరీలు కలకలం రేపుతున్నాయి. పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు చోరీకి గురవ్వగా, ఇద్దరు యువకులు బైక్ పై వచ్చి చోరీ చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితులను పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.