సంగెం: వరంగల్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో జరిగిన అట్రాసిటీ కేసులో పరారీలో ఉన్న నిందితులు మల్లయ్య, మణికంఠలను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు మాధవిని కులం పేరుతో దూషించి దాడి చేసిన కేసులో ఎస్సై వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.